తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ప్రస్తుతం గ్రూప్-1 పరీక్షల నేపథ్యంలో.. జీవో 29 రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుండగా.. ఈ విషయంలో విపక్షాల నుంచే కాదు సొంత పార్టీ నేతల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోరాటం మొదలుపెట్టారు. జీవో 29 విషయంపై రాష్ట్రంలోని అన్ని పార్టీల బీసీ సంఘాల నేతలంతా కలిసి గవర్నర్ను కలిశారు.