నేషనల్ హైవేలో ఇప్పుడు చోటా నిర్మిస్తున్నారు. ప్రయాణం సులువయినప్పటికీ టోల్‌ప్లాజాలతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ఊరి పక్కనే ఉన్నా కూడా టోల్ కట్టాల్సి వస్తోంది. ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ఐడియాతో ముందుకొచ్చింది. ప్రతిసారీ టోల్ కట్టకుండా 20 కిలోమీటర్ల లోపు ఉండే వారు ఒకేసారి ఈ పాస్ కార్డులు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. అది కూడా వైట్ నెంబర్ ప్లేట్ ఉన్నవారికే అవకాశమని చెబుతున్నారు.