హైదరాబాద్‌లోని మంజీరా, ఇందూ, రాంకీ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి సుప్రీంకోర్టు రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ హౌసింగ్ బోర్డును కోరింది. బోర్డు నిబంధనలు పాటించనందున మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్యానించి.. తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది. హౌసింగ్ బోర్డు ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.