ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఒక నటుడిని అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అని కేటీఆర్ పేర్కొన్నారు. ఘటనతో నేరుగా సంబంధం లేని అల్లు అర్జున్‌ను ఎలా అరెస్టు చేస్తారని ప్రస్నించిన కేటీఆర్.. ఇదే దిక్కుమాలిన లాజిక్‌తో హైడ్రా ఘటనలో సీఎం రేవంత్ రెడ్డిని సైతం అరెస్టు చేయాలన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా స్పందించారు.