బతుకు బండిని లాగిది పచ్చనోటేరోయ్.. అనే పాట వినే ఉంటారు. మరి ఆ పచ్చనోటు సంపాధించేందుకు బండ్లు నడుపుతూ చాలా మంది డ్రైవర్ వృత్తిలో ఉన్నారు. ఇందులో కొత్త విషయమేంటీ అనుకుంటున్నారా.. మరి ఒక ఊరిలో ఎటు చూసినా వాహనాలే కనిపిస్తూ.. ఇంటికో డ్రైవర్ ఉన్నాడంటే అది ప్రత్యేకమే కదా మరి. అచ్చంగా అలాంటి ఊరే.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొమ్మాయి గూడెం. ఈ గ్రామంలో.. చాలా మంది డ్రైవర్ వృత్తినే జీవనోపాధిగా మలుచుకోవటం గమనార్హం.