ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసిన తండ్రి.. కరీంనగర్ జిల్లాలో అమానుషం..

4 months ago 24
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీనగర్‌లో కన్న తండ్రే.. తన ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల వయసు ఉన్న కవల పిల్లలను బావిలోకి తోసేసిన శ్రీశైలం అనే వ్యక్తి.. ఆ తర్వాత తానూ దూకాడు. అయితే ఈత రావటంతో ఈదుకుంటూ వచ్చేశాడు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా అనుమానిస్తున్నారు. స్థానికులు శ్రీశైలాన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.
Read Entire Article