భర్త రెండో పెళ్లి చేసుకుని.. తనను హింసిస్తున్నాడని ఓ భార్య.. తన ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం చెందిన ఆమె గ్రామస్తులు.. ఆ ముగ్గురు మృతదేహాలను.. భర్త ఇంటి ముందే ఖననం చేయడానికి ప్రయత్నించడంతో.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఇద్దరు పిల్లలను ఇంటి ముందు పాతిపెట్టగా.. భార్య మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టారు.