యూఎస్, ఇజ్రాయెల్ సయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలు ప్రాణ భయంతో గజ గజా వణకిపోతున్నారు. తాజాగా.. యూఏఈపై ఇరాన్ జరిపిన ప్రతిదాడిలో సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ గల్ఫ్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎయిర్‌పోర్టులో పని చేసే రాజేశ్వర్ అనే వ్యక్తికి గాయాలైనట్లు తెలిసింది.