Vadapalli Temple Anna Prasadam Bhavan Inauguration: వాడపల్లి ఏడు శనివారాల వెంకన్న ఆలయం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అక్కడ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు చేపట్టారు. అలాగే వాడపల్లిలో మాడ విధులు, రోడ్డు విస్తరణ సహా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే తిరుమల తరహాలోనే వాడపల్లి అన్నప్రసాద వితరణ కోసం భారీ షెడ్ నిర్మిస్తున్నారు.. ఈ నెల 26న ప్రారంభించాలని భావిస్తున్నారు.