అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద పోలీసులు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కి గురవ్వడం, అందులో గంజాయి, మద్యం బాటిళ్లు లభ్యం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేరుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎక్స్‌లో ట్యాగ్ చేసి రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారంటూ ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా విచారణ చేయించి నిందితులను శిక్షించాలని కోరారు. అయితే, ఈ ఘటనలో ఎస్సైలు గంజాయి తరలించలేదని.. మద్యం తాగి కారు నడపలేదని ప్రకాశం జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.