రైతుబంధు విషయాన్ని, ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపింనందుకు కక్ష గట్టారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటామని చెప్పారు. హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై న్యాయవాదులతో చర్చించామని తెలిపారు. ఇటువంటి కేసులు రానున్న రోజుల్లో ఇంకా పెడతారనే విషయం తమకు తెలుసునని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్, అక్రమ కేసులతో మమ్మల్ని బలహీనపరచాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి కేసులకు తాము భయపడే వాళ్లం కాదనన్నారు.