ఇలాంటివాళ్లను ఆదుకోలేమా.. పేద కుటుంబాన్ని చూసి చలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

4 months ago 5
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఆయనకు చిత్తుకాగితాలు ఏరుకునే నిరుపేద కుటుంబం కనిపించింది. వెంటనే వారి దగ్గరకు వెళ్లిన సోమిరెడ్డి.. ఆ చిన్నారులకు, చాక్లెట్లు, బిస్కట్లు అందించారు. తన వద్దనున్న నగదును సాయంగా అందించి యోగక్షేమాలు కనుక్కున్నారు. అనంతరం పిల్లలను స్కూలుకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సోమిరెడ్డి.. ప్రపంచం అభివృద్ధి చెందుతున్నా ఇలాంటి వారు ఇంకా ఉండటం దురదృష్టకరం అంటూ ఎమోషనల్ అయ్యారు.
Read Entire Article