ఇవేం పనులు రా నాయనా.. పంచాయతీ కార్యాలయ తాళాలు పగలగొట్టి మరీ..

8 months ago 27
వికారాబాద్ జిల్లా... తాండూర్ నియోజకవర్గం పరిధిలోని గొట్లపల్లి గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ తాళాలు పగలగొట్టి, గుర్తు తెలియని వ్యక్తులు నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లారు. గొట్లపల్లి క్లస్టర్‌లోని నాలుగు గ్రామాల సర్పంచ్.. వార్డు మెంబర్ల నామినేషన్ పత్రాలు అపహరణకు గురయ్యాయి. అయితే.. అధికారులు అభ్యర్థులను ఆందోళన చెందవద్దని కోరారు. అన్ని నామినేషన్ పత్రాలు ఆన్‌లైన్‌లో స్కాన్ చేసి ఉన్నాయని, ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article