భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా గద్వాల జిల్లాలో రహదారిని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రహదారి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రహదారి నిర్మాణంలో భూమలుు కోల్పోతున్న రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఆ ప్రాంతాల్లోని రైతుల డిమాండ్ మేరకు సర్వీస్ రోడ్లు, కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.