ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన లింగం రవీంద్రరావు 72 సంవత్సరాల వయస్సులో యూరప్‌లోనే అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్‌బ్రస్ వెస్ట్ పీక్ శిఖరాన్ని అధిరోహించారు. ఆగస్టు 14వ తేదీ 5642 మీటర్ల ఎత్తులో ఉండే ఆ శిఖరాన్ని ఆయన తన 17 ఏళ్ల మనవడు పోకూరి అనురాగ్‌తో కలిసి అధిరోహించారు. 72 ఏళ్ల వయస్సులో ఆయన చేసిన ఈ సాహస యాత్రకు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఏడు పదుల వయస్సు దాటిన తర్వాత కూడా మంచు శిఖరం అధిరోహించేంత ఆరోగ్యం ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.