యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆదర్శ రైతు బిల్లపాటి గోవర్ధన్‌రెడ్డి.. రసాయన రహిత ఆహారం లక్ష్యంగా నాలుగేళ్లుగా సేంద్రియ సాగు చేస్తున్నారు. ఆయన తన పొలంలో కాలజీరా, బహురూపి, మణిపురిబ్లాక్ వంటి 23 రకాల పురాతన దేశవాళి వరి రకాలను సాగు చేస్తున్నారు. ఒంగోలు జాతి ఆవుల మలమూత్రాలతో తయారుచేసిన జీవామృతం వంటి వాటిని వినియోగిస్తూ.. గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. ఈ 'ప్రకృతిరత్న' అవార్డు గ్రహీత.. తోటి రైతులను కూడా సేంద్రియ సాగువైపు ప్రోత్సహిస్తున్నారు.