హైదరాబాద్ ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కోర్టు కొట్టేయడంతో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. కేటీఆర్ సుప్రీం కోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉన్నందున.. ముందస్తుగానే ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.