తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2028లో కాకుండా 2029 జూన్‌లోనే ఎన్నికలు జరుగుతాయని.. 2034 జూన్ వరకు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి గత సీఎంల అభివృద్ధి విధానాలను కొనసాగిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా మార్చడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ తమ పాలనా కాలాన్ని తగ్గించి చూపడాన్ని వ్యంగ్యంగా విమర్శించారు.