ఈత సరదా.. ఆరుగురు మృతి..

1 year ago 46
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు గోదావరి నదిలోకి వెళ్లిన ఆరుగురు యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. శనివారం సాయంత్రం నుంచి గల్లంతైన వారి మృతదేహాలను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) సిబ్బంది, స్థానిక పోలీసులు నిరంతరాయంగా శ్రమించి వెలికి తీశారు. పెళ్లి సంబరాలతో కళకళలాడుతున్న ఇంట ఊహించని మృత్యుఘోష వినబడటంతో, మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషాదం రెండు గ్రామాలలో పెనుశోకాన్ని నింపింది.
Read Entire Article