రేవంత్ రెడ్డి సర్కార్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ కీలక కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవంబర్ 11 నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. మేడిగడ్డ నుంచి మొదలయ్యే ఈ యాత్ర గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల మీదుగా సాగనుంది. రైతులకు ఎదురవుతున్న సాగునీటి ఇబ్బందులు, తాగునీరు, విద్యుత్ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఇక నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా 50 వేల మందితో భారీ సభ నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది.