విశాఖ యువకులు రష్యా ఆర్మీలో చిక్కుకున్నారు. తమను రక్షించాలని వీడియో ద్వారా వేడుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉపాధి కోసం రష్యా వెళ్లిన యువకులను ఓ నేపాల్ వ్యక్తి ఆర్మీలో ఫుడ్ ప్యాకేజింగ్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నమ్మబలికాడు. తీరా ఆర్మీలో చేరిన తర్వాత తమను రష్యా-ఉక్రెయిన్ బార్డర్లో యుద్ధంలోకి పంపిస్తున్నారని వారు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తాము యుద్ధభూమిలో ఉన్నామని దయచేసి ప్రధాని మోడీ తమ ప్రాణాలను కాపాడి ఏపీకి వచ్చేలా సహాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకున్నారు.