తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 4న సాయంత్రం కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12 వేల సాయం, కొత్త రేషన్ కార్డులు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.