వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో కూల్ న్యూస్ చెప్పింది. రాగల మూడు రోజుల్లో మళ్లీ వర్షాలు పడనున్నాయి. ఏపీలో కోస్తాంధ్రా, యానాం, రాయలసీమలో వర్షాలు పడనున్నాయి. సోమవారం, మంగళవారం ఉరుముల, మెరుపులత కూడిన వానలు రావడంతో పాటు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలలు వీచే ఛాన్స్ ఉంది. దీంతో చాలా ప్రాంతాలు చల్లబడనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందనున్నారు.