తల్లికి వందనం రెండో విడత నిధుల మంజూరుపై కీలక అప్‌డేట్ వచ్చింది. రెండో విడత నిధులను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించిన చర్యలు వేగంగా పూర్తి చేస్తుంది. ఈ నిధుల విడుదలకు ఇప్పటికే ఆర్ధిక శాఖ అనుమతి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి త్వరలో గ్రీన్ సిగ్నల్ రానుంది. ఈ మేరకు ఈ నెల రెండో వారంలో తల్లికి వందనం రెండో విడత నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. దీనికోసం లబ్ధిదారులు విద్యార్థి, తల్లి ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.