జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఈ కష్ట సమయంలో వారి కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.