తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని సీఎ రేవంత్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. న్యూజెర్సీలో ఎన్‌ఆర్‌ఐలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పదేండ్లలో వందేండ్ల విధ్వంసం జరిగిందని.. ఆ నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రజలు ఉచితాలపై ఆధారపడకుండా.. ఉద్యోగ ఉపాధి కల్పించటమే తమ లక్ష్యమని చెప్పారు.