రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ శాసన సభ మూడు కమిటీలను ఏర్పాటు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ టేకింగ్ కమిటీ, ఎస్టిమేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ.. శాసన సభ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. పీఏసీ ఛైర్మన్‌గా అరికెపూడి గాంధీని, ఎస్టిమేషన్ కమిటి ఛైర్ పర్సన్‌గా పద్మావతి రెడ్డిని, పీయూసీ ఛైర్మన్‌గా శంకరయ్యను నియమించింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.