కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ములుగు జిల్లాలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. లిబ్‌టెక్ ఇండియా అధ్యయనం ప్రకారం పని దినాల కల్పనలో ములుగు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా 24.6 శాతంతో రెండో స్థానంలోనూ, వరంగల్ జిల్లా 23.7 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి.