Uppal Narapally Flyover: ఆరేళ్లుగా ఉప్పల్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఫ్లైఓవర్ పనులకు ఎట్టకేలకు మోక్షం దొరకనుంది. నిర్మాణ పనులు మరోసారి ట్రాక్ ఎక్కనున్నాయి. ఉప్పల్ ఫ్లైఓవర్ పనులపై నారాపల్లిలో అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆరేళ్లుగా ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మించకపోవటంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి.. కీలక ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే కొత్త టెండర్ పిలిచి.. పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.