విశాఖపట్నంలో అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి చెందారు. మృతురాలు ఏడు నెలల గర్భిణి కావడంతో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. భర్త ఫ్యాన్‌కు వేలాడుతుండగా.. భార్య పక్కనే విగతజీవిగా పడి ఉంది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్యను చంపి భర్త ఉరివేసుకున్నాడా అనే కోణంలో.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గర్భిణి శరీరంపై కూడా ఎలాంటి గాయాలు లేవు. కాగా, భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారని మృతుడి తల్లి చెబుతోంది.