ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణ పనులు దసరా పండుగ నాడు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గోషామహల్ స్టేడియంలో 26 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆస్పత్రి భవనాలను నిర్మిస్తున్నారు. 12 అంతస్తుల భవనాలతో, 2000 పడకల సామర్థ్యంతో నిర్మించబోతున్నారు. ఈ క్రమంలో దసరా పండగ నాడు ఎంఈఐఎల్ డైరెక్టర్ కె.గోవర్ధన్ రెడ్డి ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించారు. రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోబోటిక్ సర్జరీ, హెలిప్యాడ్ వంటి సదుపాయాలతో ఈ కొత్త భవనాలను నిర్మిస్తున్నారు.