హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. భవన నిర్మాణంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.