ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండగా.. రంగంలోకి దిగిన పోలీసులు 12 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ.. కాలేజీ ప్రిన్సిపల్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ర్యాగింగ్ నేపథ్యంలో జూనియర్ విద్యార్థులు భయపడొద్దని ప్రిన్సిపల్ సూచించారు.