పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ రూపొందించిన బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్, శాసనాల సవరణ బిల్లు 2024కు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. జనాభా వృద్ధి రేటు పెంపులో భాగంగానే ఈ బిల్లును తెచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు. అయితే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఇకపై ఎందరు పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభిస్తుంది.