గంజాయి, డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గంజాయి సాగును అరికట్టేందుకు శాటిలైట్, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తామని, ముఠా గొడవలకు తావులేకుండా రాయలసీమలో ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. గంజాయి పెంచేవారని వదిలిపెట్టబోనని వెల్లడించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నార్కోటిక్స్ సెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.