Raptadu ROB Ready To Start In 20 Days: రాప్తాడు ఆర్వోబీ పనులు తుది దశకు చేరుకున్నాయని, మరో 20 రోజుల్లో పూర్తవుతాయని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. 2017లో టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన ఈ బ్రిడ్జి పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి ప్రారంభమయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఆర్వోబీ అందుబాటులోకి వస్తే ఇకపై వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.