Narsapur Bus Accident: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం సమీపంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కాలేజీకి చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక బస్సు డ్రైవర్ నాగరాజు(50) అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మరో బస్సు డ్రైవర్‌తో పాటు 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఇరువైపులా 4 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.