పాఠశాల వయస్సు నుంచే ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఎనిమిదేళ్ల పాటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న తర్వాత ఇప్పుడు ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. నిశ్చితార్థం కూడా చేసుకుని మరో వారం రోజుల్లో పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ వార్త తెలుసుకున్న ప్రియురాలు తట్టుకోలేక పోయింది. ఎనిమిదేళ్ల ప్రేమను కాదని ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకుని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడ్డు. ఈ ఘటనతో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ అరిగలవారిపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.