అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమానికి.. మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణానికి చెందిన మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే అభిమానం. ఆ అభిమానంతోనే పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల మల్లికార్జునరెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. మంచం నుంచి దిగలేని పరిస్థితి. మల్లికార్జునరెడ్డి దుస్థితి గురించి టీడీపీ శ్రేణులు నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చాయి. దీనిపై స్పందించిన నారా లోకేష్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.