ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు గంజాయి అమ్మకాల కోసం కొత్త రూట్ ఎంచుకున్నారు. పోలీసుల సోదాలు, నిఘాల నేపథ్యంలో గుర్రం ద్వారా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. తాజాగా ఈ యవ్వారం బయటపడింది. అయితే ఈ రకంగా గంజాయి అమ్మతున్న వ్యక్తులు పరారీ కాగా.. పోలీసులు గుర్రంతోపాటు ఓ నంబర్ ప్లేట్ లేని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం గంజాయి కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గంజాయి అమ్మకాల కోసం ఇలా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.