కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన తనలా కాలేరని.. ఎన్ని జన్మలెత్తినా రేవంత్ రెడ్డి కాలేరని మండిపడ్డారు. మరోవైపు.. కేసీఆర్ పాలనలో పాలమూరు సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణ వ్యయం, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంశాలను ప్రస్తావించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి లభ్యత తగ్గుతోందని.. ప్రస్తుతం ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.