Tadepalli: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విజయవాడలోని తాడేపల్లి నివాసం నుంచి బెంగళూరు సమీపంలోని యలహంకలో ఉన్న నివాసానికి షిఫ్ట్ అవుతున్నారంటూ సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు పెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో జగన్ కుంగిపోయారని, దీనికి తోడు కేసుల భయం వెంటాడుతోందని ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి తాడేపల్లి నివాసంలో కొన్ని పనులు జరుగుతున్నాయి. క్రేన్‌తో పనులు చేస్తున్న ఫోటోకు కొన్ని వ్యాఖ్యానాలు జోడించి పోస్టు చేస్తున్నారు. అసలు వాస్తం ఏంటి..? వివరాలు..