Vijaya Sai Reddy On Assembly Amaravati Resolution: ఏపీ ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధతపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. శనివారం ప్రత్యేకంగా సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అయితే ఈ తీర్మానంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. అమరావతి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఏపీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు.