ఆర్టీసీ బస్సుల్లో రద్దీతో విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులు చూసి..ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చలించిపోయారు. విద్యార్థినిల సమస్య అడిగి తెలుసుకున్న పోచారం.. ఒక్క ఫోన్ కాల్‌తో వారి సమస్యను తీర్చారు. బాన్సువాడ వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థినుల ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పోచారం.. వెంటనే డిపో మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేసి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయించారు. ఈ చర్యతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ వివరాలు..