Erragadda Mental Hospital Food Poison: హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆహారం కలుషితం కావడంతో ఒక రోగి మృతి చెందగా, 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి ఎర్రగడ్డ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. నీటి కాలుష్యంపై కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితే ఇందుకు కారణాలు వెలుగులోకి వస్తాయి.