తెలంగాణలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను గురువారం (డిసెంబర్ 26న) పోలీసులు అరెస్టు చేయగా.. నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. విధులు ఆటంకం కలిగించారన్న నేపథ్యంలో.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.