ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎలక్ర్టిక్ వాహన కొనుగోలుదారులకు శుభవార్త వినిపించింది. విద్యుత్ వాహనాలు (ఎలక్ట్రిక్ వాహనాలు) కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి పూర్తి పన్ను రాయితీ అందిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 అమల్లో ఉన్నంత కాలం విద్యుత్ వాహనాలకు రోడ్ ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే హైబ్రిడ్ నాలుగు చక్రాల వాహనాలకు మాత్రం ఈ నిర్ణయం వర్తించదని ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.