జైలులో విచారణ ఖైదీగా ఉన్న ఓ నిందితులు.. అధికారులను మాయ చేశాడు. విచారణ పూర్తి కాకముందే.. దర్జాగా బయటికి వచ్చాడు. అది కూడా పారిపోయో, విడుదలయ్యో కాదు.. ఫేక్ బెయిల్ పెట్టి జైలు నుంచి దర్జాగా బయటికి వచ్చాడు. అది కూడా జైలు అధికారులే దగ్గరుండి పంపించారు. అయితే.. మూడు రోజుల తర్వాత ఆ నిందితునిపై వచ్చిన పీటీ వారెంట్ చూసి అధికారులకు మబ్బులిడిపోయాయి. ఆరా తీస్తే అసలు ముచ్చట బయటపడింది. ఇప్పుడు అతని కోసం గాలింపు చేపట్టారు.