తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన చిన్న శ్రీను.. తాను పార్టీ మారడానికి గల కారణాలను వెల్లడించారు. బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన.. ఉత్తరాంధ్ర అభివృద్ధిగా భాగం పంచుకోవాలనే టీడీపీలో చేరినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూటమిని మరోసారి అధికారంలోకి తెస్తే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఇక టీడీపీలో చేరడానికి తాను ఎలాంటి కండీషన్లు పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు.