హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నిర్మించనున్న ఎల్బీ నగర్ హయత్ నగర్ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రణాళికలో చేర్చిన తర్వాత డీపీఆర్ తయారు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి.. ఎమ్మెల్యే కసిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు.